స్థానిక ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలి: మందకృష్ణ‌

by Ajay Maddhiboyina |

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో దివ్యాంగుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ అన్నారు.

స్థానిక ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలి: మందకృష్ణ‌
X

దిశ‌, వెబ్ డెస్క్: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో దివ్యాంగుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు దివ్యాంగుల ఫించ‌న్లు పెంచుతామ‌ని హామీ ఇచ్చింద‌ని, కానీ అమ‌లు చేయ‌కుండా మోసం చేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన ప్ర‌తిప‌క్షాలు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాయని, అందుకే తాము ప్ర‌భుత్వంపై పోరాటానికి సిద్ధ‌మైన‌ట్టు చెప్పారు.

ఇందులో భాగంగా అన్ని రాజ‌కీయ పార్టీల అధ్య‌క్షుల‌ను క‌లిసి మ‌ద్ద‌తు కోరుతున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావును క‌లిసి విన‌తీపత్రం ఇచ్చామ‌న్నారు. ప్ర‌భుత్వంపై పోరాటంలో భాగంగా ఈ నెల 13 నుండి దివ్యాంగుల మ‌హాగ‌ర్జ‌న స‌న్నాహ‌క స‌మావేశాలు జిల్లాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. ఆగ‌స్టు 13న దివ్యాంగుల మ‌హాగ‌ర్జ‌న ఛలో ఢిల్లీ కార్య‌క్రమాన్ని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు.

Next Story