- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరింత ముదిరిన మంత్రి అడ్లూరి ఇష్యూ.. పొన్నం, వివేక్‍పై మందకృష్ణ మాదిగ ఫైర్
మంత్రి అడ్లూరి వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‍పై (Adluri Laxman) మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామిపై తాజాగా మందకృష్ణ మాదిగా ఫైర్ అయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‍ను పొన్నం ప్రభాకర్ దున్నపోతు అని సంబోధిస్తే ఆ వ్యాఖ్యలను తోటి దళిత మంత్రి వివేక్ వెంకట స్వామి ఖండించకపోగా సమర్ధించినట్లుగానే హావభావాలు ప్రదర్శించడం ఏంటని మండిపడ్డారు. లక్ష్మణ్ మీద పొన్నం వ్యాఖ్యలు మంచిది కాదని దళితులు, బలహీనవర్గాల మధ్య ఈ వివాదం పెరగవద్దని వెంటనే తాను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‍కు ఫోన్ చేశానని చెప్పారు. ఈ సమస్య మరింత పెద్దది కాకూడదని త్వరగా పరిష్కారం కావాలని తాము చూస్తున్నామన్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం పొన్నం ప్రభాకర్ చెప్పే క్షమాపణ మీదే ఆధారపడి ఉందని అందువల్ల తక్షణం పొన్నం క్షమాపణలు చెప్పాలన్నారు.
మిమ్మల్నెవరు పొమ్మన్నారు?:
అడ్లూరి లక్ష్మణ్ పరిధిలో ఉన్న మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానకి అరగంట ముందుగా వెళ్లి అడ్లూరి రాలేదని ఎందుకు మాట్లాడారు? అసలు ఆ శాఖలో పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్ జోక్యం ఎందుకు అని నిలదీశారు. మీ శాఖల్లో ఇతరులు కోమటిరెడ్డి, పొంగులేటి జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. నాడు జరిగిన కార్యక్రమానికి పొన్నం, వివేక్ ను ముఖ్యమంత్రే పంపి ఉంటే సీఎం కూడా తప్పిచేసినట్లేనన్నారు. తోటి దళితుడిని అలా అనకూడదని ఖండించాల్సిన వివేక్ వెంకట స్వామి అడ్లూరిని హేళన చేసినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. అడ్లూరి ఆలస్యంగా వస్తే మేము ఉండలేమి మాట్లాడారు. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు?ఎవరు పొమ్మన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేక్.. ఆ సోయి కూడా లేదా?
అడ్లూరి లక్ష్మణ్‍ను పట్టుకుని పొన్నం దున్నపోతు అని అవమానిస్తే అందకు ముందు వివేక్ వెంకట స్వామి (Vivek Venkata Swamy) తన తండ్రి కాకా 96 జయంతి ఉత్సవాల సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ ను అవమానించారని ఆరోపించారు. ఈ ఉత్సవాలకు రెండ్లు, బీసీ, మాలలను ఆహ్వానించిన వివేక్ వెంకట స్వామి ఆయన సోదరుడు, ఆయన కుమారుడు దళిత సంక్షేమ శాఖ మంత్రి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‍ను పిలవకపోవడం అంటే అర్థం ఏంటని నిలదీశారు. తోటి మాల సోదరుడుడే తోటి మాదిగ మంత్రిని కనీసం ఆహ్వానించాలనే సోయి కూడా లేదంటే మాదిగలను అవమానించినట్లే కదా? అడ్లూరి లక్ష్మణ్‍ను మంత్రిగా చూస్తున్నారా లేదా అని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ సమ న్యాయం కోసం అని ఆ పరిధి దాటితే దళితులు ఉమ్మడి హక్కుల కోసం మనమంతా కలిసి పోరాడాల్సిందేనన్నారు.






