Manchu Family: మంచు ఫ్యామిలీలో గొడవలు.. గాయాలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరో మనోజ్

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-08 06:11:54  IST  )

టాలీవుడ్(Tollywood) సీనియర్ హీరో మంచు మోహన్(Mohan Babu) బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Manchu Family: మంచు ఫ్యామిలీలో గొడవలు.. గాయాలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరో మనోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) సీనియర్ హీరో మంచు మోహన్(Mohan Babu) బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ(Manchu Family) నుంచి కన్నప్ప(Kannappa) చిత్రం వస్తోంది. ఇందులో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు కూతుర్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంచు ఫ్యామిలీలోని గొడవలు బయటకు వచ్చాయి.

తండ్రి మోహన్ బాబుపై కొడుకు మనోజ్(Manchu Manoj).. మనోజ్‌పై మోహన్ బాబు పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. తండ్రి నన్ను, నా భార్యను కొట్టాడని మనోజ్.. లేదు మనోజే తనపై దాడి చేశాడని ఇద్దరు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో డిస్కషన్ రాగా.. చివరకు దాడులకు దారి తీసి కంప్లైంట్ వరకు వెళ్లినట్లు సమాచారం. ఒంటినిండా గాయాలతో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story