- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూపు రాజకీయలకు భయపడేది లేదు: ఖర్గే
కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు చేయవద్దని, పార్టీలో కొందరు చేస్తున్నటువంటి వాటికి అస్సలు భయపడేది లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యనించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు చేయవద్దని, పార్టీలో కొందరు చేస్తున్నటువంటి వాటికి అస్సలు భయపడేది లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యనించారు. కాంగ్రెస్ లోని నేతల మధ్య విభేదాలుంటే పార్టీలోనే చర్చించుకోవాలి.. కానీ బయట ఎవ్వరూ మాట్లాడవద్దని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వవద్దని ఆయన సూచించారు. ఏదేని సమస్యలుంటే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, నేతలతో కో ఆర్డినేట్ చేసుకోవాలన్నారు. గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ), సలహా కమిటీ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీలో కొత్తగా చేరిన వారిని పాతవారు కలుపుకోని, వారిని సమన్వయం చేసుకోవాని ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలకంగా ముందుకు సాగాలన్నారు.
నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు భర్తీ చేయండి..
ఇదివరకే బ్లాక్, మండల్ డివిజన్ స్థాయి నియామకాలు ఎక్కువ భాగం జరిగాయని. ఈనెలఖరు నాటికి మండల స్థాయిలో పార్టీని పటిష్ట పర్చాలన్నారు. అలాగే, ఖాళీగా ఉన్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు జిల్లా స్థాయి పదవులనూ భర్తీ చేయలన్నారు. ఈ విషయంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇన్ చార్జి మంత్రులు జిల్లాల నేతల పేర్ల జాబితాను సిద్ధం చేసి సీఎంకు ఇవ్వాలని సూచించారు. స్థానిక ఎన్నికల కన్నా ముందుగా మార్కెట్ కమిటీల పాలక మండళ్లు, ఆలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల పాలక మండళ్లు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు, ఆత్మ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. ఖాళీ ఉన్న స్థానాల్లో కొత్త వారిని నియమించాలని, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాగే, ఆగస్టు 30 నాటికి గ్రామ పంచాయతీ స్థాయి కమిటీలు పూర్త చేయాలని ఖర్గే సూచించారు.
నేతలపై కేసులను వెంటనే ఎత్తేయాలి..
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో పాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేతలపై కక్ష పూరితంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలన్నారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేకంగా కేబినెట్ సమవేశం ఏర్పాటు చేసి కేసులు ఎత్తివేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా మంత్రులపై మరోసారి అంసతృత్తి వ్యక్తం చేశారు. ఆయా మంత్రులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవ్యహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్, మంత్రులు సైతం తమతమ అభిప్రాయాలను ఖర్గే దృష్టికి తెచ్చారు.
వీటిపైనే ప్రధానంగా చర్చ..
గాంధీ భవన్లో నిర్వహించిన పీఏసీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా ఈ మీటింగ్ లో బిసి కుల గణన, ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం చేపట్టిన అంశాలు, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు, జై సంవిధాన్ బచావో కార్యక్రమాలపై మాట్లాడారు. అలాగే సంస్థాగతంగా పార్టీ నిర్మాణం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థలు ఎన్నికలపై చర్చించారు. పార్టీలోని కీలక విషయాలపై ముఖ్య నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. పార్టీలో నెలకొన్న అనేక సమస్యలపై పరిష్కారం చేసే దిశగా నేతలు ముందుకెళ్లాలని ప్రధాన నాయకత్వానికి ఆయన సూచించారు. ఇదిలా ఉండగా సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు.






