హైదరాబాద్‌కు చేరుకున్న Malla Reddy అల్లుడు.. ఐటీ దాడులపై ఏమన్నారంటే?

by Sathputhe Rajesh |   (  Updated:2022-11-24 04:56:33  IST  )

హైదరాబాద్‌కు చేరుకున్న Malla Reddy  అల్లుడు.. ఐటీ దాడులపై ఏమన్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: విహార యాత్ర కోసం టర్కీ వెళ్లిన మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి గురువారం తిరిగి వచ్చారు. ఈ రోజు ఉదయం టర్కీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐటీ దాడులపై స్పందించారు. మా వాళ్ల ఫోన్లు ఐటీ అధికారుల దగ్గర ఉన్నట్టున్నాయి. ఎవరికి ఫోన్లు చేసినా స్పందించడం లేదు. నాది సాధారణ ఇల్లు.. తన ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ లాకర్లు లేవన్నారు. నాకు ఏ ఐటీ అధికారి ఫోన్ చేయలేదన్నారు. నేను ఇంటికి వెళ్తే కానీ పూర్తి వివరాలు తెలియవన్నారు. కాగా మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడుల చేసి రూ.3కోట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే.

Also read....

ఈడీ నెక్ట్స్ టార్గెట్ అధికార పార్టీ ఎమ్మెల్సీ.. ముందే ఊహించాడా?

Next Story