అనుమతివ్వండి.. బార్ పెట్టుకుంటా: మంత్రికి మల్లారెడ్డి రిక్వెస్ట్

by Gantepaka Srikanth |

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

అనుమతివ్వండి.. బార్ పెట్టుకుంటా: మంత్రికి మల్లారెడ్డి రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన నూతన వ్యాపార ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులపై మంత్రితో చర్చించారు. మల్లారెడ్డి ఇటీవల ప్రారంభించిన తన వినూత్న 'ఫ్లైట్ రెస్టారెంట్'లో మద్యం విక్రయాలకు సంబంధించి బార్ లైసెన్స్ మంజూరు చేయాలని మంత్రి జూపల్లిని కోరారు. మల్లారెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, నిబంధనల ప్రకారం ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఫ్లైట్ రెస్టారెంట్‌లో బార్ నిర్వహించాలంటే, ప్రభుత్వం నిర్దేశించిన 'ఎలైట్ బార్' (Elite Bar) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నిబంధనల అమలు..

ఎలైట్ బార్ అనుమతి కోసం అవసరమైన ఫీజులు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా అధికారికంగా అప్లై చేసుకోవాలని, నిబంధనలకు లోబడి ఉంటే పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజులుగా మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థలు మరియు వ్యాపారాలపై ప్రభుత్వ పరంగా తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో, ఆయన నేరుగా మంత్రిని కలిసి తన వ్యాపార అనుమతుల కోసం కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Next Story