- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన మల్లాపూర్ విద్యార్థిని
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. మధుప్రియా అనే విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పురం ఉమారాణి తెలిపారు.

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. మధుప్రియా అనే విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పురం ఉమారాణి తెలిపారు. విద్యార్థిని సాధించిన ఈ విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మధుప్రియా కృషి, పట్టుదలతో చదివి ట్రిపుల్ ఐటీ బాసరలో ప్రవేశం పొందడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయురాలు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించగలరని ఆమె నిరూపించిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మధుప్రియను గ్రామస్థులు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, చక్రధర్, షఫీక్, శ్రీనివాస్ రెడ్డి, లలిత, షరీఫ్ అహ్మద్ తదితరులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థులు మధుప్రియా విజయాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.






