- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక సంస్థల ఎన్నికలను లైట్ తీసుకోవద్దు.. కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ పిలుపు
డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్‌లతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్‌లతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. రాజకీయంగా బీసీలను అణగదొక్కారని అన్నారు. బీసీ కులగణన చేసి పకడ్బందీగా బీసీ బిల్లు తెచ్చి బీసీలకు రాజకీయ సుస్థిర స్థానం కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆశయాల మేరకు ఎవరి జనాభా ప్రకారం వారి వాటా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేసిందని అన్నారు.
కులగణన చేపట్టాం.. బీసీ కమిషన్ వేశాం.. డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి లెక్కలు తేల్చాం.. అసెంబ్లీ, మండలిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ బిల్లు చేశామని అన్నారు. ఆ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతికి పంపి ఆలస్యం అవుతుంటే కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయమంటే ఆర్డినెన్స్ తెచ్చామని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ఆమోదించకపోవడంతో ఈ రోజు అసెంబ్లీలో మళ్ళీ రిజర్వేషన్లు పరిమితి ఎత్తివేస్తూ 42 శాతం బీసీ రిజర్వేషన్లు చేసి బిల్లు పాస్ చేసి చూపించామని అన్నారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధి అని చెప్పారు. ఎన్ని రాజకీయ, సాంకేతిక, న్యాయపరమైన అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని నేడు బీసీల రిజర్వేషన్లు విషయంలో అన్ని చేసి చూపించాం.. బీసీ రిజర్వేషన్ల హీరోగా రాహుల్ గాంధీ, ఖర్గే, రేవంత్ రెడ్డిలను నిలబెట్టాలని.. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏమాత్రం సులువుగా తీసుకోవద్దు.. పూర్తి స్థాయిలో విజయం సాధించేలా కృషి చేయాలని అన్నారు.






