- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cabinet expansion: మంత్రివర్గ విస్తరణపై మహేశ్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన నిజామాబాద్‌లో కేబినెట్ విస్తరణ అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో (cabinet expansion) మంత్రివర్గ విస్తరణ అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రకరకాల సమీకరణాల వల్లే మంత్రి వర్గ విస్తరణ జాప్యం జరుగుతోందని వెల్లడించారు. ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారని, ఖాళీలు ఏమో తక్కువ ఉండటంతో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయమని.. తాము కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని అన్నారు. దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్ ఇంకా సీఎంది.. వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ కావాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వ సాధారణం
అదేవిధంగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం ఖరారయ్యే చాన్స్ ఉందన్నారు. అలాగే తెలంగాణలో సీఎం మార్పు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమేనని తిప్పికొట్టారు. మహిళా కాంగ్రెస్ ఆందోళనపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వ సాధారణమన్నారు. మహిళలకు కాంగ్రెస్‌లో ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలో లేదని అన్నారు.






