Oke Okkadu Revanth : 'ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి' పుస్తకావిష్కరణ

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాసిన ఒకే ఒక్కడు ఎనుముల రేవంత్ రెడ్డి అనే పుస్తకాన్ని టీపీసీసీ చీఫ్ ఆవిష్కరించారు.

Oke Okkadu Revanth : ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి పుస్తకావిష్కరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాసిన ఒకే ఒక్కడు ఎనుముల రేవంత్ రెడ్డి (Oke Okkadu Revanth Reddy) అనే పుస్తకాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత వేణుగోపాల్ రెడ్డి రాశారు. ఇవాళ (Gandhi Bhavan) గాంధీభవన్‌లో ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్ (PCC Chief Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో రచయిత వేణుగోపాల్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విలక్షణమైన నాయకుడని కొనియాడారు.

చిన్న వయసులో రాజకీయాల్లో డైనమిక్ లీడర్‌గా ఎదిగారని ప్రశంసలు కురిపించారు. ప్రజా స్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్భందాలతో పాలన చేస్తున్న (KCR) కేసీఆర్ మీద పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. రేపు సీఎం పుట్టిన రోజు సందర్భంగా ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే టీపీసీసీ తరఫున మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రికి ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story