- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ లో నాలుగు ముక్కలాట : మహేశ్ కుమార్ గౌడ్
రానున్న ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా కనుమరుగవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్ : రానున్న ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా కనుమరుగవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. మరికొద్ది ఏళ్లలో గులాబీ పార్టీ ముఖచిత్రం కూడా ఎవరికీ గుర్తు కూడా ఉండదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో అంతర్గతంగా "నాలుగు ముక్కలాట" జరుగుతోందని ఎద్దేవా చేసారు. కేటీఆర్, కవితల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడుతోందని ఆరోపించారు. ఈ అంతర్గత విభేదాలను అదునుగా భావించి, మాజీ మంత్రి హరీష్ రావు పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఈ వివాదాలన్నీ భరించలేక కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమైనట్లు ఎద్దేవా చేసారు. అలాగే కవితను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కానీ బీఆర్ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, ఇది ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ కాబోతోందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.






