90 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం పక్కా: మహేశ్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

90 సీట్ల‌తో మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భ‌వ‌న్లో ఏర్పాటు చేసిన‌ పీసీసీ విస్తృత‌స్థాయి స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

90 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం పక్కా: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్: 90 సీట్ల‌తో మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భ‌వ‌న్లో ఏర్పాటు చేసిన‌ పీసీసీ విస్తృత‌స్థాయి స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో అమ‌లవుతున్న ప‌థ‌కాలు, చేసిన అభివృద్ధితో పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని అన్నారు.

అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన రేవంత్ రెడ్డి సీఎం, బీసీనైన త‌న‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చార‌ని, న‌లుగురు ద‌ళితుల‌కు క్యాబినెట్‌లో చోటు దక్కిందని అన్నారు. మరో దళిత బిడ్డకు స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించిందని వ్యాఖ్యానించారు. కొత్తగా నియమితులైన పార్టీ నేలకు పార్టీ చక్కటి అవకాశం కల్పించిందని దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభలో గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులకు ఖర్గే దిశానిర్దేశం చేస్తారన్నారు.

Next Story