- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ రోజు ఈడీ విచారణకు హాజరుకానున్న మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కు ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు (ED Notices) ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలైన సాయి సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్‌లతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసు (Money laundering case)లో ఈడీ విచారణలో భాగంగా మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో భాగంగా ఆయన ఈ రోజు ఈడీ విచారణ (ED investigation)కు హాజరు కానున్నారు. సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబు రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది.
ఇందులో రూ.3.5 కోట్లు నగదు, రూ.2.5 కోట్లు ఆర్‌టీజీఎస్ ట్రాన్స్‌ఫర్ (RTGS Transfer) ద్వారా చెల్లించారు. దీనిపై విచారణకు ఏప్రిల్ 27, 28న విచారణకు రావాలని ఈడీ నోటీసులు (ED Notices) ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు.. షూటింగ్ వల్ల ఏప్రిల్ 27 లేదా 28న విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. అలాగే తాను విచారణకు వచ్చేందుకు మరో తేదీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఈ రోజు విచారణకు రావాలని సూచించింది. దీంతో నేడు మహేష్ బాబు (Mahesh Babu) ఈడీ విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది.
- Tags
- ED
- maheshbabu






