- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత క్రీడా స్ఫూర్తితో ఆటలాడి గెలవాలి : సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
యువత క్రీడా స్ఫూర్తితో ఆటలాడి గెలవాలని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వెల్దండ ప్రీమియర్ లీగ్ 1 క్రికెట్ టోర్నమెంట్ ను వారు ప్రారంభించారు.

దిశ, వెల్దండ: యువత క్రీడా స్ఫూర్తితో ఆటలాడి గెలవాలని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వెల్దండ ప్రీమియర్ లీగ్ 1 క్రికెట్ టోర్నమెంట్ ను వారు ప్రారంభించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మొదటిసారిగా వీపీఎల్ లీగ్ 1 క్రికెట్ ను గ్రామ యువతను ప్రోత్సహించాలనే భావనతో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ ప్లేయర్లతోపాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు " జనగణ మన" జాతీయ గీతంతో ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరుగుతాయని, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలి చేందుకు కృషి చేయాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ బసన మోని శ్రీను, ఆర్యవైశ్య జిల్లా మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, నాయకులు సంజీవ్ కుమార్ యాదవ్, కృష్ణ ముదిరాజ్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ముదిగొండ రమేష్, కానుగుల జోగయ్య, శిరసనగండ్ల శేఖర్, వీపీఎల్ 1 ఆర్గనైజేషన్ మెంబర్లు, నాయకులు ఉన్నారు.






