- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజ అభివృద్ధిలో యువత చురుకైన పాత్ర పోషించాలి : ఎస్పీ జానకి
సమాజ అభివృద్ధిలో యువత చురుకైన పాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఎస్పీ జానకి పిలుపునిచ్చారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : సమాజ అభివృద్ధిలో యువత చురుకైన పాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఎస్పీ జానకి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో 'కౌమార దశ' లోని విద్యార్థుల కోసం నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసంగించారు. యువత దేశ భవిష్యత్తుకు పునాదులవ్వాలని, వారికి ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, పాలనా విధానాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. మాక్ పార్లమెంటు వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యత పెంపొందుతాయన్నారు. మంచి సమతుల ఆహారం, సురక్షిత జీవన విధానం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదం పడతాయని వివరించారు. అదేవిధంగా కౌమార దశ లో ఉన్న విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన జీవన శైలి, సైబర్ భద్రత, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పార్లమెంటు కార్యకలాపాలను అనుకరిస్తూ వివిధ ప్రజా సమస్యలపై చర్చించి తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ నర్సింహులు, డీడబ్ల్యూఓ జరీనా బేగం, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.






