త్వరలో అలంపూర్ కు రూ.200 కోట్ల‌తో యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్

by Ratna Kumari |

మల్లమ్మ కుంట రిజర్వాయర్ కోసం అఖిలపక్షంతో కలిసి పాదయాత్ర చేస్తా అని మల్లు రవి అన్నారు.

త్వరలో అలంపూర్ కు రూ.200 కోట్ల‌తో యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్
X

దిశ, అలంపూర్ టౌన్ : మల్లమ్మ కుంట రిజర్వాయర్ కోసం అఖిలపక్షంతో కలిసి పాదయాత్ర చేస్తా అని మల్లు రవి అన్నారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని హరిత టూరిజం హోటల్ లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరితతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వాన్ని నమ్మి సర్పంచులను గెలిపించిన మాదిరిగానే రాబోయే పురపాలక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో ఎవరు అమలు చేయనటువంటి పథకాలను రెండు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలకు చేరువైందని వెల్లడించారు. ఎంపీ నిధుల నుండి పురపాలకల అభివృద్ధి కోసం అనేక నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా అలంపూరు ఐజ వడ్డేపల్లి పురపాలికలకు 35 కోట్లు విడుదల చేసినట్లు తెలియజేశారు. పురపాలక ఎన్నికల అనంతరం వాటిని ఖర్చు చేస్తారని తెలిపారు. త్వరలోనే అలంపూర్ లో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story