- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ జంట ఆత్మహత్య
దిశ, భూత్పూర్ : మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో యువ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే.. కొత్తూరు గ్రామానికి

దిశ, భూత్పూర్ : మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో యువ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే.. కొత్తూరు గ్రామానికి చెందిన పోలేమోని మొగులయ్య, మణెమ్మ దంపతుల కుమారుడు రమేష్ (29)కి గత జూన్ నెలలో గోపాల్ పేట మండలం చీర్కేపల్లి గ్రామానికి చెందిన నిర్మల అలియాస్ శ్రీలక్ష్మి (21) తో వివాహం జరిగింది. వివాహం అయినప్పటి నుంచి భార్యాభర్తలు ఇరువురు అన్యోన్యంగానే ఉంటూ వచ్చారు. బుధవారం తండ్రి మొగులయ్య శ్రీశైలం వెళ్ళగా.. మృతుని తల్లి మణెమ్మ కూలి పనులకు వెళ్ళింది. భార్యాభర్తలు రమేష్, నిర్మల ఇంట్లోనే ఉన్నారు. తల్లి, చుట్టుపక్కల వారు పనులు ముగించుకొని ఇంటికి రాగా తలుపులు మూసుకొని ఉన్నాయి. కిటికీలోంచి చూడగా నిర్మల నేలపై పడి ఉండగా, రమేష్ తాడుకు వేలాడుతూ ఉన్నట్లుగా కనిపించడంతో వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించారు. ఇద్దరి మధ్య గొడవలు జరిగి నిర్మలను మొదట కొట్టడం వల్ల మరణించిందా.. లేక ఆత్మహత్యకు పాల్పడిందా.. భార్య మృతి తో ఆవేశంలో రమేష్ ఇంట్లో ఉన్న చీరను ఫ్యానుకు కట్టి ఉరి వేసుకున్నట్లుగా గుర్తించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లిదండ్రులకు రమేష్ ఒక్కడే కుమారుడు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.






