- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధిత కుటుంబానికి అండగా ఉంటా : ఎమ్మెల్యే మేఘారెడ్డి
ఏదుల మండల పరిధిలో చీర్కపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి కేశవులు దంపతులకు ఇటీవల రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, రేవల్లి : ఏదుల మండల పరిధిలో చీర్కపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి కేశవులు దంపతులకు ఇటీవల రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కేశవులు అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్య వనజ హైదరాబాద్ లోని మీనాక్షి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి మంగళవారం వనజను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రూ.10వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే ఏదుల గ్రామానికి చెందిన కొమ్ము నారాయణ అనారోగ్య సమస్యతో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండల సీనియర్ నాయకులు పందెం సుఖేందర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా ఎల్లవేళలా నియోజకవర్గ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్య వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని అనారోగ్య బాధితులకు భరోసా కల్పించారు. వైద్యులతో చర్చించి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డి గోపుల పరశురాములు, జమ్మి మల్లేష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డమీది రాములు, ఉప్పరి యాదయ్య, ఉప్పరి శివ, సురేష్, ఉప్పరి మల్లేష్ పాల్గొన్నారు.






