- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్.. భర్త సస్పెన్షన్
దిశ, గోపాల్ పేట : గోపాల్ పేట సర్పంచ్ అభ్యర్థి స్వప్న భాస్కర్ పై చేస్తున్న కుటిల రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు పానుగంటి సురేష్ కుమార్

దిశ, గోపాల్ పేట : గోపాల్ పేట సర్పంచ్ అభ్యర్థి స్వప్న భాస్కర్ పై చేస్తున్న కుటిల రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు పానుగంటి సురేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయంలో భాగంగా దళిత మహిళకు గోపాల్ పేట జనరల్ స్థానంలో ఎస్సీ మహిళకు అవకాశం కల్పించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ అభ్యర్థి కరోళ్ల స్వప్న భర్త భాస్కర్ పై కుట్రలు పన్ని అక్రమంగా సస్పెన్షన్ విధించింది. ఈ విషయాన్ని దళిత సామాజిక వర్గం మొత్తం గోపాల్ పేట బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలో విఫలమైందని.. ఓట్లు అడగడానికి వేరే దారి లేక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కుటీల రాజకీయాలకు తెరలేపారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కుటుంబాల్లో వాళ్ల కుటుంబ సభ్యులు గవర్నమెంట్ జాబుల్లో విధులు నిర్వహించడం లేదా ఫంక్షన్లకు కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం లేదా..? అలా అటెండ్ అయిన వ్యక్తి పై అక్రమంగా సస్పెన్షన్ విధించడం ఎంత వరకు సమంజసం అని అడుగుతున్నాం. కర్రోళ్ల భాస్కర్ ప్రజల మనిషి అంటే నేను ఉన్నా అంటూ కష్ట, సుఖాల్లో తోడు ఉన్న వ్యక్తి. పెళ్లిళ్లకు, చదువులకు, హెల్త్, చావులకు అన్నింటిని ఆదుకున్న వ్యక్తి కేబీఆర్.. అలాంటి వ్యక్తి పై సస్పెన్షన్ విధించడం అంటే వారు ఎంత భయడుతున్నారో ఇట్టే అర్థమవుతుందన్నారు. అక్కడే వారు నైతికంగా ఓటమి చెందారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాలరాజు మాజీ కో ఆప్షన్ ఎండి మతిన్ మాజీ ఉపసర్పంచ్ శివ, తదితరులు పాల్గొన్నారు.






