- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుక్కెడు బువ్వ అయినా తింటాం.. గ్యాస్ ఇప్పియ్యండి
మండల కేంద్రంలో ఇండియన్ గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి మండలాల ప్రజలు.

దిశ, గోపాల్ పేట : మండల కేంద్రంలో ఇండియన్ గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి మండలాల ప్రజలు. ఉమ్మడి మండలంలో దాదాపు 40 నుంచి 50 గ్రామాల ప్రజలకు ఒక్కటే గ్యాస్ ఏజెన్సీ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ప్రజలు పేర్కొంటున్నారు. దయచేసి ప్రభుత్వం ఇంకొక గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. వినియోగ దారులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రంలో ఇండియన్ గ్యాస్ బుక్ చేసుకొని గ్యాస్ గోదాం దగ్గరికి ఉదయం మంగళవారం ఉదయం 4గంటల నుంచి ఒక కుండ తర్వాత ఒక కుండ లైన్ లో పెట్టి దాదాపు రెండు, మూడు గంటలు లైన్ లో నిలబడితే 7 గంటల నుంచి గ్యాస్ ఇవ్వడంతో 7వ తేదీ నుంచి 15వ తేదీలోపు వినియోగ దారులకు గ్యాస్ ఇస్తామని చెప్పినట్టు సమాచారం.
16వ తేదీ నుంచి ఈరోజు వరకు ఇండియన్ గ్యాస్ బుక్ చేసుకున్న వాళ్లకి మళ్ళీ వారం,1 0 రోజులు టైం పడుతుందని నిరాశ చెంది వెను తిరిగే రిస్థితి గోపాల్పేట మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. దీంతో ప్రజల ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దయతలచి ప్రజల మీద దయ తలచి సకాలంలో గ్యాస్ అందుతే బుక్కెడు భువనైనా తింటామని ఆవేదన చెందుతున్నారు. బుక్ చేసిన కస్టమర్లకు ఓటిపి రాక ఇబ్బందుల్లో వినియోగదారులు. తీరా ఓటీపీ వచ్చిన తరువాత గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లితే వారం రోజుల తర్వాత గ్యాస్ ఇస్తామంటున్నారు గ్యాస్ ఏజెన్సీలు. గ్యాస్ ఏజెన్సీకి ఒక లారీ రావడానికి నాలుగు నుంచి వారం రోజులు పడుతుందని అంటున్న ఏజెన్సీ అధికారి. ఇండియన్ గ్యాస్ ఓనర్ ని దిశ వివరణ కోరగా.. ఒక్క బండి డెలివర్ కావడానికి మినిమం 4 నుంచి 6 రోజుల సమయం పడడంతో వినియోదారులకు సరైన సమయంలో గ్యాస్ అందించలేక పోతున్నామని తెలపడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.






