అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాం : ఎస్పీ జానకి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు కుంటలు పొంగి పొర్లుతున్నాయని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని

అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాం : ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు కుంటలు పొంగి పొర్లుతున్నాయని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎస్పీ జానకి భరోసా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పెద్ద చెరువు, రామయ్య బౌలి, ట్యాంకుబండ్, ఎర్రకుంట చెరువులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఆమె స్వయంగా పరిశీలించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ లకు అవసరమైన అన్ని చర్యల గురించి పలు సూచనలు చేస్తూ, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. పొంగిపొర్లే చెరువులు, వాగులు,వంకల నీటి ప్రవహాల దగ్గరకు వెళ్ళకూడదని, చేపల వేటకు, సెల్ఫీ లు దిగేందుకు ప్రయత్నించకూడదని చిన్న పిల్లలు, వృద్ధులు నీటి ప్రాంతాల వద్దకు వెళ్లనీయకూడదని, వర్షపునీరు ఎక్కువగా చేరిన రోడ్లు, లోతైన మడుగులు, డ్రైన్లను దాటే ప్రయత్నం చేయకూడదని ఆమె హెచ్చరించారు. అలాగే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని చెరువులు, వాగుల పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.

Next Story