- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివక్షతకు గురయ్యాం హక్కుతో సాధించాం : మంత్రి వాకిటి శ్రీహరి
దాదాపు 70 ఏళ్ల స్వాతంత్య్రంలో మక్తల్ నియోజకవర్గంగా ఏర్పడ్డిన పరాయి నేతల ప్రాతినిథ్యంతో మక్తల్ నియోజక వర్గం అభివృద్ధి చెందక వివక్షతకు గురైందని రాష్ట్ర క్రీడ, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

దిశ, మక్తల్ : దాదాపు 70 ఏళ్ల స్వాతంత్య్రంలో మక్తల్ నియోజకవర్గంగా ఏర్పడ్డిన పరాయి నేతల ప్రాతినిథ్యంతో మక్తల్ నియోజక వర్గం అభివృద్ధి చెందక వివక్షతకు గురైందని రాష్ట్ర క్రీడ, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోని హక్కుతో నియోజక వర్గానికి కోర్టు కార్యాలయాలను సాధించుకు న్నామని మక్తల్ కేంద్రంలో నూతనంగా కోర్టు ప్రారంభించడానికి వస్తున్న రాష్ట్ర హైకోర్టు న్యాయాధిపతికి నియోజకవర్గానికి చెందిన తెలంగాణ హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్ రెడ్డి ద్వారా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.అనిల్ కుమార్, టీ. మాధవి దేవి అశోక చక్రం తో తయారుచేసిన గిఫ్టును న్యాయాధిపతికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మక్తల్ నియోజకకవర్గం అభివృద్ధి చెందేందుకు అందరూ కృషి చేయాలని తెలిపారు. నీటి వనరులు, రైల్వే లైన్, రహదారులు అందుబాటులో ఉండేవిధంగా చేస్తానని తెలిపారు. గత పాలకులు చేసిన తప్పును తాను చేయనని తెలిపారు. ప్రతి యువకుడు ప్రతి పౌరుడు మభ్యం నుండి బయటపడాలని నియోజక వర్గానికి రావలసిన కార్యాలయాలను అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తో మన హక్కుగా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరు చేతులు కలపాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.






