- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనపర్తి మొదటి వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మామ హఠాన్మరణం
వనపర్తి పట్టణంలోని రాయిగడ్డ మాజీ కౌన్సిలర్ చుక్కరాజు తండ్రి చుక్క సత్యం ఇవాళ ఉదయం అకస్మాత్తుగా మరణించారు.

దిశ, వనపర్తి టౌన్ : వనపర్తి పట్టణంలోని రాయిగడ్డ మాజీ కౌన్సిలర్ చుక్కరాజు తండ్రి చుక్క సత్యం ఇవాళ ఉదయం అకస్మాత్తుగా మరణించారు. చుక్కరాజు సతీమణి, చుక్కా జయశ్రీ, ప్రస్తుత ఎన్నికలలో ఒకటో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గా బరిలో ఉన్నారు. ఇవాళ ఉదయం చుక్క రాజు, వారి సతీమణి ఇద్దరు కలిసి, చుక్క రాజు తల్లిదండ్రుల ఆశీస్సులు, తీసుకొని పోలింగ్ కేంద్రం దగ్గర కు వెళ్ళారు. వారు పోలింగ్ కేంద్రం దగ్గర కు వెళ్లిన కొద్దిసేపటికే చుక్క సత్యం ఆకస్మాత్తుగా మరణించారు. వారికి విషయం తెలిసిన వెంటనే,తండ్రి భౌతికకాయాన్ని సందర్శించారు. మళ్ళీ పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లి ఓటర్లకు, తమకు ఓటు వేయాలని కోరుతూ కనిపించారు. ఒక వైపు తండ్రి చనిపోయిన బాధను, కళ్లలో, గుండెలో మోస్తూ, మరో వైపు బాధ ను దిగమింగుకొని ఎన్నికల ఘట్టం లో పాలు పంచుకుంటున్నారు. పలువురు ఎన్నికల రోజూ ఇలా జరగడం చాలా బాధాకరం అని పేర్కొంటున్నారు.






