గొల్లపల్లి రిజర్వాయర్ పై రాద్ధాంతంచేస్తున్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

by Ratna Kumari |

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు లో భాగమైన ఏదుల-గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించిన బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మండిపడ్డారు.

గొల్లపల్లి రిజర్వాయర్ పై  రాద్ధాంతంచేస్తున్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
X

దిశ, వనపర్తి : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు లో భాగమైన ఏదుల-గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించిన బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మండిపడ్డారు. బుధవారం వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలోమీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు- ఏదుల రిజర్వాయర్-గొల్ల పల్లి రిజర్వాయర్ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందే పరిస్థితి లేదన్న నిజంకాదాఅని ప్రశ్నించారు.నీళ్లు తీసుకునేందుకే రెగ్యులేటర్ ఏర్పాటు చేశామని చెప్పే నాయకులు రెగ్యులేటర్ దాని కింద ఉన్న బుద్ధారం రిజర్వాయర్ లో ఎత్తు ఎంతో చెప్పాలన్నారు.రిజర్వాయర్ ద్వారా అందించే ఆయకట్టుకు అలైట్మెంట్ ఎందుకు చేయలేదన్నారు.వనపర్తికి సంబంధించి గొల్లపల్లి రిజర్వాయర్ గోపాల్పేట, ఖిల్లా ఘణపురం రిజర్వాయర్, బుద్ధారం రిజర్వాయర్, బుద్ధారం స్టేజ్ 2 రిజర్వాయర్ , గట్లఖానాపురం రిజర్వాయర్, ఈ 6 రిజర్వాయర్లలో ఆరు నుంచి ఎనిమిది టిఎంసిల నీటి నిల్వ ఉంటుందని పేర్కొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.రిజర్వాయర్ మొదలుపెట్టిన బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులేనని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదని అప్పుడున్న ప్రాజెక్టులనే ప్రస్తుతం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులపైనే తాను అసెంబ్లీలో మాట్లాడానని,రైతులను,ప్రజలతో రిజర్వాయర్లు వద్దంటూ దొంగ దీక్షలు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు.మాజీ ఇరిగేషన్ శాఖ మాతృ హరీష్ రావు హయాంలో చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన కొంతమంది నష్ట పరిహారాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేసిన మీరు నేను నీతులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలలో అభివృద్ధి పేరు మీద వనపర్తి నియోజకవర్గంను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.వనపర్తి నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి రాజు నిర్మించిన రిజర్వాయర్లన్నీ డౌన్ స్టీమ్ లోకి వెళ్లిపోయాయని కేవలం బుద్ధారం, బుద్ధారం స్టేజ్ 2, పోల్కే పహాడ్, గొల్లపల్లి రిజర్వాయర్ల నుంచి మాత్రమే వనపర్తి నియోజకవర్గానికి సాగునీరు అందుతుందన్నారు.ఈ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విన్నవించి ఉన్నామని,త్వరలోనే నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story