పాలేరుని అక్కున చేర్చుకున్నమంత్రి వాకిటి శ్రీహరి

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : తమతో వ్యవసాయ పాలేరుగా నమ్మకంగా పని చేసిన గుంతలి శివణ్ణను ఆప్యాయతగా ప‌లుక‌రించి ఆరోగ్యం పై ఆరా తీశారు మంత్రి వాకిటి శ్రీహ‌రి. వ‌య‌స్సు మ‌ళ్లీ కంటి చూపు మంద‌గిస్తుంద‌ని..

పాలేరుని అక్కున చేర్చుకున్నమంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ‌, మ‌క్త‌ల్ : తమతో వ్యవసాయ పాలేరుగా నమ్మకంగా పని చేసిన గుంతలి శివణ్ణను ఆప్యాయతగా ప‌లుక‌రించి ఆరోగ్యం పై ఆరా తీశారు మంత్రి వాకిటి శ్రీహ‌రి. వ‌య‌స్సు మ‌ళ్లీ కంటి చూపు మంద‌గిస్తుంద‌ని.. ఆర్థిక స‌హాయం కావాల‌ని మంత్రితో కంట‌త‌డి పెట్టుకోవ‌డంతో మంత్రి శ్రీహ‌రి చ‌లించిపోయారు. వంద‌లాది ఎక‌రాల వ్య‌వ‌సాయ భూస్వామిగా త‌న తండ్రి పొలం కాస్తూ చేస్తున్న స‌మ‌యంలో త‌న చిన్న త‌నంలో పెద్ద పాలేరుగా త‌మ‌తో కుటుంబ స‌భ్యునిగా ఉండి ప‌ని చేస్తూ న‌మ్మ‌కంతో వ్య‌వ‌సాయ ప‌నులు చేసేవార‌ని పాలేరుగా ఎత్తుగా దృఢంగా ఉండి ప్ర‌స్తుతం అనారోగ్యంతో చూసి చ‌లించిపోయారు. సొంత ఖ‌ర్చుల‌తో వైద్యం చేయిస్తానని ప్ర‌స్తుతం ఆ కుటుంబానికే ఆర్థిక స‌హాయం అందించారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉండి చిన్న‌త‌నంలో పాలేరుగా ప‌ని చేసిన వ్య‌క్తిని ఆప్యాయంగా అక్కున చేర్చుకొని ప‌లుక‌రించ‌డం అక్క‌డ ఉండి దృశ్యాన్ని చూసిన వారంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

Next Story