గుర్తు తెలియ‌ని మ‌హిళా మృతి

by Nallavelli.Anjaneyulu |

గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

గుర్తు తెలియ‌ని మ‌హిళా మృతి
X

దిశ‌, ఎర్ర‌వ‌ల్లి : గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవి కథనం మేరకు ఎర్రవల్లి చౌరస్తాలో గత కొన్ని రోజుల నుంచి బిక్షాటన చేస్తున్న మహిళ ఆదివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా గద్వాల్ రోడ్డు లో గుర్తు తెలియని మహిళ రోడ్డు పక్కన పడుకొని ఉండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. మృత దేహాన్ని గద్వాల ప్రభుత్వ మార్చరీలో ఉంచారు. మహిళ మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్ట‌యితే ఇటిక్యాల ఎస్సై రవిని సంప్రదించాల‌ని కోరారు. గుర్తు ప‌ట్టిన వారు ఈ నెంబ‌ర్ల‌కు 8712670282, 9346987198 కాల్ చేయాల‌ని సూచించారు.

Next Story