జిల్లా అల్లుడిని.. మీ స‌మ‌స్య‌ల‌ను తీరుస్తా : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

by Ratna Kumari |

దిశ‌, మక్త‌ల్ : తాను జిల్లా అల్లుడిని అని.. మీ స‌మ‌స్య‌ల‌ను త‌ప్ప‌కుండా తీరుస్తాన‌ని, మ‌క్త‌ల్ ముఖ‌చిత్రం మారుతుంద‌ని తెలంగాణ ఇరిగేష‌న్ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధ‌వారం

జిల్లా అల్లుడిని.. మీ స‌మ‌స్య‌ల‌ను తీరుస్తా : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
X

దిశ‌, మక్త‌ల్ : తాను జిల్లా అల్లుడిని అని.. మీ స‌మ‌స్య‌ల‌ను త‌ప్ప‌కుండా తీరుస్తాన‌ని, మ‌క్త‌ల్ ముఖ‌చిత్రం మారుతుంద‌ని తెలంగాణ ఇరిగేష‌న్ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధ‌వారం మ‌క్త‌ల్ మండ‌లంలోని జూరాల బ్యాక్ వాట‌ర్ లో ముంప‌నకు గురైన అనుగొండ‌, అంకెన్ ప‌ల్లి, దాధ‌న‌న్ ప‌ల్లి, పారేవుల‌, సంగంబండ రిజ‌ర్వాయ‌ర్ లో నేరేడుగొమ్ము, భూత్పూర్ ముంపు గ్రామాల ప‌రిస్థితిని తాను ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా గ‌మ‌నించా అని ముంప‌న‌కు గురైన గ్రామాల్లో దేవాల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ‌, ఇళ్లు కోల్పోయిన కుటుంబాల‌కు న్యాయం చేస్తాన‌ని, ఈ ప్రాంత ప‌రిస్థితి గురించి మంత్రి వాకిటి శ్రీహ‌రి త‌న దృష్టికి తీసుకొచ్చేవాడ‌ని ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో ఎన్నిక‌ల కోడ్ ఉన్న ప‌రిస్థితిని ప‌రిశీలించిన‌ట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీటి వనరులు అందుబాటులో ఉన్న వినియోగించుకోవడానికి ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులు చెక్ డ్యామ్, నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే కొంత మంది లేనిపోని ఆరోప‌ణ‌ల‌తో సామాజిక మ‌ద్యంలో పోస్ట్ లు పెట్టి రాక్ష‌స ఆనందం పొందుతున్నార‌ని, ప‌ద‌మూడేళ్ల పాల‌న‌లో చూపాల‌న్నారు.


కోట్లాది రూపాయ‌ల నిధులు తెచ్చి పేద విద్యార్థులు కార్పొరేట్ చ‌దువుల కోసం ఇంటిగ్రేటేడ్ స్కూల్, సంగంబండ‌లఓ హోష్టు కాల్వ ప‌నులు, మ‌క్త‌ల్ టూ నారాయ‌ణ పేట‌కు రూ.200 కోట్ల‌తో రెండు వ‌రుస‌ల రోడ్లు ప్ర‌తీ మండ‌లంలో ఆట స్థ‌లాల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌ను ప్రారంభించాన‌ని ప్ర‌స్తుతం కృష్ణాన‌ది పై కొత్త బ్రిడ్జి అయ్యాక పాత బ్రిడ్జిని చెక్ డ్యామ్ గా మార్చితే రెండు టీఎంసీల నీటిని నిలువ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. నాలుగు భారీ చెబ్ డ్యామ్ లు నిర్మించేందుకు ప్ర‌పోజ‌ల్స్ త‌యారు చేశాన‌ని, సంగంబండ రిజ‌ర్వాయ‌ర్ కుడి, ఎడ‌మ మెయిన్ లోయెస్ట్ కాలువ‌ల‌కు లైనింగ్ ప‌నులు చేయ‌డం వ‌ల్ల చివ‌రి భూముల వ‌ర‌కు సాగునీరు అందుతుంద‌ని తెలిపారు. నేరేడుగొమ్ము, భూత్పూర్ ముంపు గ్రామాల పున‌రావాల ఫైల్ ని ఓపెన్ చేసి వారికి నిధులు మంజూరు చేయాల‌ని, టేన్ ఎగ్జిబిష‌న్ ద్వారా జూరాల ప్రాజెక్ట్ కింద ముంపున‌కు గురైన దాద‌న్ప‌ల్లి, పారేవుల‌, అంకెన్ ప‌ల్లి, అన‌కొండ గ్రామాల‌కు నాలుగు గ్రామాల్లో 10 ఎగ్జామ్స్ కోసం నిదులు మంజూరు చేయాల‌ని మంత్రి ఉత్త‌మ్ దృష్టికి మంత్రి వాకిటి శ్రీహ‌రి తీసుకెళ్లారు. మాజీ ఎంపీపీ గ‌డ్డం హ‌నుమంతు, మాజీ జ‌డ్పీటీసీ ల‌క్ష్మారెడ్డి, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Next Story