- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
దిశ, జడ్చర్ల : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన శనివారం సాయంత్రం జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ శివారులోని

దిశ, జడ్చర్ల : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన శనివారం సాయంత్రం జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ శివారులోని 167 వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగపూర్ శివారులోని లలితాంబిక ఆశ్రమం వద్ద గల 167 వ జాతీయ రహదారి పై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. మండల పరిధిలోని తంగేళ్లపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ, మిడ్జిల్ మండలానికి చెందిన రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణ వద్ద ఉన్న రూ.5400 ఇద్దరి మొబైల్ ఫోన్లను ఆస్పత్రి సిబ్బందికి జడ్చర్ల 108 ఎమర్జెన్సీ టెక్నీషియన్ శివకుమార్ రెడ్డి అందజేసినట్లు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.






