ఎమ్మెల్యే వంశీకృష్ణ‌కు స‌న్మానం

by Ratna Kumari |

మండల పరిధిలోని వెలమల పల్లి గ్రామంలో స్థానిక ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్ పంపరి రామస్వామి మంగళవారం అచ్చంపేట క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ను కలిసి శాలువాతో సన్మానించారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ‌కు స‌న్మానం
X

దిశ, వంగూర్: మండల పరిధిలోని వెలమల పల్లి గ్రామంలో స్థానిక ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్ పంపరి రామస్వామి మంగళవారం అచ్చంపేట క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ను కలిసి శాలువాతో సన్మానించారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి ఆయనతో వివరించారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ను కలిసి అచ్చంపేట నుంచి వచ్చే బస్సులు వెలమలపల్లి గేటు వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ను ఏర్పాటు చేయాలని మేనేజర్ తో మాట్లాడి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంపరి రామస్వామి, ఉప సర్పంచ్ ఉడుత చిట్టెమ్మ , వార్డు మెంబర్స్ మరియు నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Next Story