- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ కలెక్టర్ రవితేజకు సన్మానం
దిశ, మక్తల్ : సూర్యాపేట జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవితేజ ఆదివారం మక్తల్ కి వచ్చిన సంద ర్భంగా డిప్యూటీ కలెక్టర్ రవితేజకు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

దిశ, మక్తల్ : సూర్యాపేట జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవితేజ ఆదివారం మక్తల్ కి వచ్చిన సంద ర్భంగా డిప్యూటీ కలెక్టర్ రవితేజకు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో ఎంపికై ప్రస్తుతం రవితేజ ఆదివారం అమ్మమ్మ, తాతయ్య రామచంద్రప్ప రిటైర్డ్ ఎఎస్ డబ్య్లు రావడంతో అంబేద్కర్ యువజన సంఘం ఘనంగా సత్కరించారు. డిప్యూటీ కలెక్టర్ రవితేజ మాట్లాడుతూ అంబేద్కర్, ఫూలే తనకు స్పూర్తి దాయకమన్నారు. బడుగు బలహీన వర్గాల కృషికి పాటు పడతానని తెలిపారు. మహనీయులు మహాత్మ జ్యోతిరావుపూలే, అంబేద్కర్ కోరుకున్న ఆశయాల, ఆలోచనల మార్గంలో సమాజంలోనీ దళిత, బహుజన బలహీన పేద వర్గాల ప్రజల విద్య, సామాజిక ,ఆర్థిక అభ్యునతికి కృషి చేస్తానన్నారు. అట్టడుగు స్థాయి నుండి కష్టపడి చదివి ఐఏఎస్ ఆధికారిగా ఎదిగిన రవితేజను యువత స్పూర్తిగా తీసుకొవాలని పలువురు దళిత సంఘ నాయకులు అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మక్తల్ అధ్యక్షులు పృధ్విరాజ్, ప్రధాన కార్యదర్శి బండారి కృష్ణ. కాంగ్రెస్ నాయకులు గోలపల్లి నారాయణ, కోరి మారెప్ప పాల్గొన్నారు.






