హైద‌రాబాద్ నుంచి రాయ‌చూర్ కి రైళ్ల‌ను తిప్పాలి : రుద్ర స‌ముద్రం రామ‌లింగం

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : హైదరాబాద్ నుంచి రాయచూర్ మ‌ధ్య రోజు రైళ్ల‌ను తిప్పాల‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారుడు రుద్ర స‌ముద్రం రామ‌లింగం కోరారు. మంగ‌ళ‌వారం దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డైరెక్టర్ ప్రశాంత్ జీ ని

హైద‌రాబాద్ నుంచి రాయ‌చూర్ కి రైళ్ల‌ను తిప్పాలి : రుద్ర స‌ముద్రం రామ‌లింగం
X

దిశ‌, మ‌క్త‌ల్ : హైదరాబాద్ నుంచి రాయచూర్ మ‌ధ్య రోజు రైళ్ల‌ను తిప్పాల‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారుడు రుద్ర స‌ముద్రం రామ‌లింగం కోరారు. మంగ‌ళ‌వారం దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డైరెక్టర్ ప్రశాంత్ జీ ని తెలంగాణ ఉద్యమ కారుడు రుద్రసముద్రం రామలింగం క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. చ‌దువు, వ్యాపారం, ఉద్యోగం, సాప్ట్ వేర్, రాజ‌కీయ నాయ‌కులు ఇలా వంద‌లాది మంది ప్ర‌యాణికులు రోడ్డు మార్గం ద్వారా ప్ర‌యాణిస్తుంటార‌ని.. వారి సౌక‌ర్యార్థం ప్ర‌తిరోజు ఉద‌యం, సాయంత్రం రైళ్లు తిరిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ప్రస్తుతం అర గంటకు రాయచూరు నుంచి హైదరాబాద్ నుంచి రొజు 60 బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పుతూ లాభాలు గడిస్తున్నారని.. వారి సౌకర్యార్థం కోసం రాయచూరు హైదరాబాద్ మధ్యన ప్రస్తుతం నడుస్తున్న ఒక్క ట్రైన్ కి బదులు రెండు ట్రైన్లను తిప్పాలని కోరారు. ఈ మార్గం గుండా బెంగళూరుకు వేళ్ళడంతో దాదాపు 200 కిలోమీటర్లు వారు దూరం తగ్గి సమయం కలిసొస్తుందని అందుకు మ‌హ‌బూబ్ న‌గ‌ర్, మ‌క్త‌ల్ బెంగళూరుకు ఎక్స్ ప్రెస్ ట్రైన్ తిప్పాలని అదనంగా మక్తల్ మీదుగా తిరుపతికి రైళ్లను నడపాలని తెలిపారు. ఈమార్గ గుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయంలో హైదరాబాద్ రాయచూర్ మక్తల్ మీదుగా రైళ్ళను తిప్పితే అంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌ని తెలిపారు. ప్రశాంత్ జీ పై అధికారుల దృష్టికి తీసుకెల్లి అమ‌లు అయ్యేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారని రుద్ర స‌ముద్రం రామ‌లింగం తెలిపారు.

Next Story