కల్వకుర్తిలో విషాదం.. డెలివరీకి 14 రోజుల ముందే ఆపరేషన్

by Ratna Kumari |

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డెలివరీకి 14 రోజుల ముందే ఓ మహిళలకు ఆపరేషన్ చేయడంతో తీవ్ర రక్తస్రావమై చికిత్స

కల్వకుర్తిలో విషాదం..  డెలివరీకి 14 రోజుల ముందే ఆపరేషన్
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డెలివరీకి 14 రోజుల ముందే ఓ మహిళలకు ఆపరేషన్ చేయడంతో తీవ్ర రక్తస్రావమై చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. దీంతో ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కల్వకుర్తి లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో శుక్రవారం చోటు చేసుకుంది. వివ‌రాల్లొకి వెళ్లితే.. డిండి మండలానికి చెందిన అంజమ్మ(23) ఆంజనేయులు భార్య భర్తలు. భార్య గర్భం దాల్చడంతో కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో 9 నెలలుగా చూయించుకుంటున్నారు. సెప్టెంబర్ 1న మెడిసిన్ అయిపోయిందని ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ మెడిసిన్ ఇచ్చి పాప క్యూర్ గా ఉంది అని చెప్పింది.సెప్టెంబర్ 22 డెలివరీ డేట్ ఇచ్చారు. కానీ సెప్టెంబర్ 6 తారీకు రోజే చేయించుకోండి పాప ఆరోగ్యంగానే ఉంది అని చెప్పింది. సరే అని సెప్టెంబర్ 6 తారీకు ఉదయం 09 గంటలకు ఆపరేషన్ చేశారు. 11 గంటల తర్వాత పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాదు ఎల్బీనగర్ లోని ఓ హాస్పిటల్కు తీసుకు వెళ్లాలని డాక్టర్ చెప్పింది. తీవ్ర రక్తస్రావమైన ఆమెను హైదరాబాదులోని ఎల్బీనగర్ ఓ హాస్పిటల్ కు తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటూ (అక్టోబర్ 03) శుక్రవారం ఉదయం మృతి చెందింది. చికిత్స కోసం 30 లక్షలు ఖర్చు చేసిన ఫలితం లేకపోయిందని భర్త కన్నీరు మున్నీరయ్యారు. చేసేదేంలేక కల్వకుర్తి పట్టణంలోని రమ్య హాస్పిటల్ ముందు మృతదేహాన్ని గురించి ఆందోళన చేపట్టారు. తన భార్య మృతికి కారమైన హాస్పిటల్ ను సీజ్ చేసి చట్టపురమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story