- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్ లో మూడు ఇంటర్ పరీక్ష కేంద్రాలు
మక్తల్ పట్టణంలో బుధవారం వారం నుంచి కొనసాగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు.

దిశ, మక్తల్ : మక్తల్ పట్టణంలో బుధవారం వారం నుంచి కొనసాగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైనార్టీ గురుకుల కాలేజీ స్కాలర్స్ ప్రైవేటు జూనియర్ కాలేజ్ లో పరిక్షలు కొనసాగుతాయని దాదాపు రెండు వేలకు పై బడి విద్యార్థులు పరిక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. వీరిలో స్కాలర్ జూనియర్ కాలేజీ సెంటర్ లో ఒకేషనల్ పరిక్షలకు సంబంధిం చిన సెంటర్ లో దాదాపు 141 మంది విద్యార్థులు పరీక్షలకు హజరౌతున్నారని.నిర్వాహుకులు తేలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు స్తానిక ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.
ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 16 వరకు జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు దాదాపు రెండు వేల పైబడి మంది విద్యార్థులు పరిక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో వ్యక్తులు గుమికూ డటం నిషిద్ధమని, కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు పరిక్షలు కొనసాగే సమయంలో మార్చి 18 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు మూసి ఉంచాలని మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరిక రాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని, విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే చేరుకోవాలని విద్యార్థులకు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి సూచనలు చేశారు.






