- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయిన సంఘటన మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

దిశ, నర్వ : చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయిన సంఘటన మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. నర్వ ఎస్సై పబ్బతి రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతర్చేడ్ గ్రామానికి జయప్రద, శివారెడ్డి దంపతులు బైకు పై వస్తుండగా.. 09-10-2024న జయప్రద మెడలో ఉన్న గొలుసును అపహరించుకుపోయారు. ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రజలను ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని మోటార్ సైకిల్‌పై వచ్చి బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కుర్వ రాములు, గట్టు వెంకటేష్, డ్యాం వెంకటేష్ ముగ్గురు అమరచింత మండలం, వనపర్తి జిల్లా కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నారాయణపేటలోని అదనపు న్యాయస్థానం ముందు హాజరు పరచగా.. వారిని జ్యూడిషియల్ రిమాండ్ కి పంపించినట్టు ఎస్సై రమేష్ తెలిపారు. మండల పరిధిలో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తుల పట్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.






