- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Thieves : మేము పోలీసులం నీ దగ్గర ఉన్న బంగారం ఇటు ఇవ్వు...
by Batti.Sumithra |
దొంగతనాలకు పాల్పడే గుర్తుతెలియని వ్యక్తులు ఏకంగా పోలీసుల పేరు చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

X
దిశ, నారాయణపేట క్రైమ్ : దొంగతనాలకు పాల్పడే గుర్తుతెలియని వ్యక్తులు ఏకంగా పోలీసుల పేరు చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని గొడుగుగిరి హనుమాన్ మందిరం వద్ద పల్లా వీధికి చెందిన బసవరాజ్ బ్యాంకు నుంచి చౌక్ బజార్ కు నడుచుకుంటూ వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు బండి పై వచ్చి మేం పోలీసులమని ఫేక్ ఐడి కార్డు చూయించారు.
దొంగతనాలు జరుగుతాయి అలా బంగారం వేసుకుంటే ఎలా ఇక్కడ ఇవ్వు కవర్లో పెట్టి ఇస్తా అంటూ మాయ మాటలు చెప్పి నమ్మించారు. గొలుసు, ఉంగరం తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు ఒక కవర్లో రాళ్లను పెట్టి తిరిగి సదరు వ్యక్తికి ఇచ్చారు. చౌక్ బజార్ కు వెళ్లిన బస్వరాజ్ కవర్ తెరిచి చూడగా అందులో రాళ్లు ఉన్నట్లు గుర్తించి తాను మోసపోయినట్లు నారాయణపేట పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటన పై దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story






