- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుద్దారం గ్రామంలో నీళ్ళు లేవు అనేది అబద్దపు ప్రచారం : కాంగ్రెస్ నాయకులు
బుద్దారం గ్రామంలో నీళ్ళు లేవు అనేది అబద్దపు ప్రచారం అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

దిశ, గోపాల్ పేట : మండల పరిధిలోని బుద్దారం గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీసీ రోడ్లు, డ్రైనేజీ లు మంజూరు చేశారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. గత నెల కిందటే గ్రామంలో వీధి లైట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు గ్రామం అంతటా రూ.1లక్ష 80 వేలతో లైట్లు వేయించారు. బుద్దారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. బుద్దారం గ్రామంలో నీళ్ళు లేవని దాహం అనేది అబద్ద ప్రచారం అన్నారు. గ్రామంలో మంచి నీటి సమస్య ఎప్పుడూ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం కానీ వేసవి కాలంలో తీవ్రమైన నీటి సమస్య వచ్చింది. అప్పుడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గ్రామంపై ఉన్న అభిమానంతో 3 కొత్త బోర్లు,6 కొత్త మోటర్లు,3 పాత బోర్లకు డ్రిల్లింగ్ మొత్తంగా 18 లక్షల 50 వేల రూపాయలతో అందుకు సంబంధించిన సామాగ్రి ఇచ్చి నీటి సమస్యను తీర్చాడు. ఆరోజు నుండి ఈరోజు వరకు గ్రామంలో మంచి నీటి సమస్య లేదు. కానీ ఇప్పుడు కొత్తగా నీటి సమస్య ఉందని, గ్రామం మొత్తం బిందెలతో కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నట్లు నీటి సమస్య ఉందని అది మేము దాతలతో తెచ్చి నీటి సమస్య తీరుస్తున్నట్లు,పేపర్ స్టేట్మెంట్ ఇప్పించడం కరెక్ట్ కాదు. ఊరంతా ప్రస్తుతం చీకట్లో ఉన్నట్లు మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి లైట్లు వేస్తున్నారు.
గత నెల క్రిందటే గ్రామంలో వీధి లైట్లు లేకపోతే కాంగ్రెస్ నాయకుడు గ్రామం అంతటా లక్షా 80 వేల ఖర్చుతో లైట్లు వేయించారు. బుద్దారం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు సీసీ రోడ్లు, డ్రైనేజీ లు మంజూరు చేశారు. కృష్ణారావు మంచి ధాత కావొచ్చు కానీ గ్రామంలో నీటి సమస్యను తీర్చాడు అనేది కరెక్ట్ కాదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పై విమర్ష నాత్మకంగా పేపర్ స్టేట్మెంట్ లు కరెక్ట్ కాదు గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన మొదటి సంవత్సరం లోపే ఎమ్మెల్యే, CCరోడ్లు, కానీ, పరిశుభ్రత పరంగా కానీ, వీధి లైట్ల పరంగా కానీ,అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలోని కార్యకర్తల రూపంలో అన్ని సమస్యలు తీర్చాడు. కాబట్టి బురదజల్లే ప్రచారాలు మానుకొనీ, గ్రామాభివృద్ధికి తోడ్పడండి. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పోటీలపై పడి నీటి విడుదలకు ఇబ్బందికరంగా ఉంటే ప్రభుత్వం చెయ్యలేదనే వార్తలు ఎక్కువ వస్తాయి కాబట్టి అందరూ అర్థం చేసుకొని మెలగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చంద్రయ్య, మాజీ దేవాదాయ శాఖ చైర్మన్ పెంటారావు, పార్టీ సీనియర్ నాయకులు ఎల్ల గౌడ్, వార్డు మెంబర్లు వీరపాగ రవి, నరేందర్ గౌడ్, నాయకులు మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, చాంద్ పాషా, తెలుగు తిరుపతయ్య,జాంప్ల తండా రవి పాల్గొన్నారు.






