- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగుల సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నవి
దివ్యాంగజనుల సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నవని,అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: దివ్యాంగజనుల సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నవని,అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం ఆర్థోపెడికల్ డిజబులిటీ బాలుర హాస్టల్లో,'మహబూబ్ నగర్ దివ్యాంజన్ కౌశల్ వికాస్,దివ్యాంజన్ రోజ్గార్ సేతు' లో భాగంగా.. వికలాంగులలో ప్రేరణ కలిగించే దిశగా నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016లో కేంద్రం అమలులోకి తెచ్చిందని,ఈ చట్టంలో సెక్షన్ 24 ప్రకారం ఆదాయ పరిమితికి లోబడి వైకల్య పెన్షన్లు,ఉపకరణలు అందించాలని సంబంధిత ప్రభుత్వం ఆదేశించిందని ఆమె తెలిపారు. అనంతరం ఎల్ఎస్యూసీ,ఎల్ఎస్యూఎం కమీటీ సభ్యులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి,లీగల్ ఎయిడ్ కేసులు,లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జరీనా బేగం,ఫీల్డ్ సూపర్వైజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






