మ‌క్త‌ల్ మున్సిపాలిటీ బ‌రిలో 65 మంది అభ్య‌ర్థులు

by Ratna Kumari |

మ‌క్త‌ల్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం అన్ని పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో 65 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్న‌ట్టు క‌మిష‌న‌ర్ శ్రీరామ్ తెలిపారు.

మ‌క్త‌ల్ మున్సిపాలిటీ బ‌రిలో 65 మంది అభ్య‌ర్థులు
X

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం అన్ని పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో 65 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్న‌ట్టు క‌మిష‌న‌ర్ శ్రీరామ్ తెలిపారు. మంగళవారం మూడో తేదీ మూడు గంటలకు వరకు పోటీ నుంచి విరమించుకోవాలని గడువు ఉండగా స్క్రూట్నీ ముగిసే సమయానికి 83 మంది అభ్యర్థుల నామినేషన్లు పోటీకి ఓకే చేశారు. గడువు ముగిసే సమయానికి 18 మంది పోటీదారులు తమ నామినేషన్ల పత్రాలను వాపస్ తీసుకోగా.. బరిలో 65 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలుగు అక్షరాల ప్రకారం..వార్డులో పోటీలో ఉన్న వారి మొదటి పేరులో అక్షరం ప్రకారం నెంబర్లను వరస క్రమంలో గుర్తులను లిస్టులో ఉంచుతామని ఆ లిస్టు ఎన్నికల అధికారి ఓకే చేశాక పబ్లిస్ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు 23 మంది పోస్టల్ బ్యాలెట్ లో దరఖాస్తు చేసుకున్నట్టుగా ఆయన తెలిపారు. పూర్తి వివరాలతో రాత్రి 7 గంటల వరకు లిస్టును ప్రకటిస్తామని కమిషనర్ శ్రీరామ్ తెలిపారు.

Next Story