పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం -మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం -మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ,మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే కులాలకు,కులవృత్తులకు గౌరవం వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో బీసీ వెనుకబడిన కులాల వారికి ఇస్తున్న ఆర్థిక సహాయంలో భాగంగా 200 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని,ముఖ్యంగా రైతులకు రైతుబంధు,రైతు బీమా,పేదల ఆడ పిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్లు,వికలాంగుల పెన్షన్లు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అంతేకాక ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,బీసీ లకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని,వెనుకబడిన తరగతుల కులాల వారికి ఇచ్చే ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చెక్కులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.తమ ప్రభుత్వ హయాంలోనే కులాలు,కుల వృత్తులకు గౌరవం తీసుకురావడం జరిగిందని,కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తెచ్చామని,జిల్లా కేంద్రంలో అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్ లను నిర్మించామని,స్మశాన వాటికలను ఏర్పాటు చేశామని అన్నారు.వెనుకబడిన తరగతుల వారికి ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్,డిసిసిబి వైస్ చైర్మన్ వెంకటయ్య,గోపాల్ యాదవ్,గణేష్,ఎంపీపీ సుధాశ్రీ,వైస్ ఎంపిపి అనిత,మార్కెట్ కమిటీ చైర్మన్ రహామాన్,వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి,కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్,ఎంపీటీసీ వడ్ల శేఖర్,జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ సంక్షేమ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed