ఎస్సీ వర్గీకరణ విజయం మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే

by Naveena |

ఎస్సీ వర్గీకరణ కోసం పద్మ శ్రీ అవార్డు గ్రహిత మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న పోరాట విజయమే ఎస్సీ వర్గీకరణ అని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగాళ్ల సురేష్ మాదిగ అన్నారు.

ఎస్సీ వర్గీకరణ విజయం మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే
X

దిశ, మిడ్జిల్ : ఎస్సీ వర్గీకరణ కోసం పద్మ శ్రీ అవార్డు గ్రహిత మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న పోరాట విజయమే ఎస్సీ వర్గీకరణ అని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగాళ్ల సురేష్ మాదిగ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో డప్పులతో ర్యాలీ తీసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడి గాళ్ళ సురేష్ మాదిగ మాట్లాడుతూ.. 70 ఏళ్ల అన్యాయానికి 30 ఏళ్ల పోరాటం తోడై మూడు గ్రూపులుగా వర్గీకరణ సాధించడం జరిగిందని అన్నారు. ఈ వర్గీకరణ పోరాటం పూర్తిగా మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు దక్కాల్సిన వాటాను తగ్గించి మాలలకు న్యాయం చేకూర్చే విధంగా ఈ వర్గీకరణ చేయడం జరిగిందని, భవిష్యత్తులో మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ కోటాను పెంచి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాదిగ అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ టైగర్ జంగయ్య మాదిగ, జిల్లా కార్యదర్శి శివ మాదిగ,గణేష్, సీనియర్ నాయకులు దానేలు, బాలయ్య, బుచ్చయ్య, వెంకటయ్య, దేవయ్య, రాములు, బాలు, రాజేశ్వర్,పల్లె తిరుపతి, కావలి వెంకటయ్య, పరుశురాం, భీమ్రాజ్,వంశీ, ధనరాజ్,అంజి, మల్లేష్, క్రాంతి, అంజి, నగేష్, చంటి తదితరులు పాల్గొన్నారు

Next Story