రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది : డాక్ట‌ర్ జిల్లెల చిన్నారెడ్డి

by Ratna Kumari |

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, స్పోర్ట్స్ చైర్మ‌న్ శివ‌సేనారెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది :  డాక్ట‌ర్ జిల్లెల చిన్నారెడ్డి
X

దిశ, గోపాల్ పేట : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, స్పోర్ట్స్ చైర్మ‌న్ శివ‌సేనారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్త కాపు శివసేనారెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఇటలీ, గ్రీస్, చైనా, అమెరికా వంటి దేశాలు ఒలంపిక్స్ లోఅత్యధిక మెడల్స్ గెలుస్తున్నాయి. కానీ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మాత్రం తక్కువ మెడల్స్ గెలుస్తుండడం బాధాకరమన్నారు. వచ్చే ఒలంపిక్స్ లో భారతదేశానికి అత్యధిక మెడల్స్ రావాలని ఎక్కువ మంది క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉండాలని అన్నారు. ఆటలకు కులమత బేధాలు లేకుండా ఎవరైతే పట్టుదలతో సాధన చేస్తారో వారికి విజయం లభిస్తుంది అన్నారు. క్రీడాకారులు మైదానంలోకి దిగిన తర్వాత ప్రపంచాన్ని మరిచిపోయి ఆడితే ప్రపంచమే క్రీడాకారుల వైపు చూస్తుందని క్రీడాకారులను చిన్నారెడ్డి ఉత్సాహపరిచారు.

విద్యార్థులు ఉదయం సాయంత్రం ఆటలు ఆడుతూ ఆటలో నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో క్రీడలకు 350 కోట్లు మాత్రమే కేటాయించే వారిని ప్రజా ప్రభుత్వం మాత్రం 850 కోట్లు బడ్జెట్లో కేటాయించిందని వచ్చే బడ్జెట్లో 1000 కోట్లకు పెరుగుతుందని అన్నారు. ఆటలలో క్రికెట్ క్రీడకి ఎక్కువ ఆకర్షణ ఉందని కానీ ఒలంపిక్స్ లో మెడల్స్ హాకీ , ఫుట్ బాల్ ఇంకా క్రీడల వైపు క్రీడాకారులు దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఓటమి కూడా భాగమేనని ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని విజయం సాధించాలని క్రీడాకారులను ప్రోత్సహించారు. మనకంటూ ఒక గుర్తింపు ఉండకపోవచ్చు. కానీ మనం ఆడే ఆట ద్వారా చాలామందికి గుర్తుండిపోతాం. అలాగే మన ప్రాంతానికి గుర్తింపు తెస్తాం. కాబట్టి క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేయాలని క్రీడాకారులకు సూచించారు. వనపర్తి లో ఎక్కువ క్రీడాకారులను తయారు చేసింది నారాయణదాసుగారని అన్నారు. పల్లెలో ఉన్న మట్టి మాణిక్యాలను వెలికి తీయడానికి సీఎం కప్ పని చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కప్పులో విజేతలుగా నిలవాలని క్రీడాకారులకు చిన్నారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నిర్వహించిన బాలుర ఆటల పోటీల్లో కబడ్డీలో మొదటి బహుమతి శ్రీరంగపూర్, రెండో బహుమతి పెబ్బేరు విద్యార్థులు, కోకోలో మొదటి బహుమతి వనపర్తి రూరల్ మొదటి,రెండో బహుమతి పెద్దమందడి విద్యార్థులు, వాలీబాల్ మొదటి బహుమతి ఘనపూర్,రెండో బహుమతి రేవల్లి విద్యార్థులు గెలుపొందారు. ఈకార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీఅధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్,ఎం తాహసిల్దార్ తిలక్ కుమార్ రెడ్డి,డీఈవో అబ్దుల్ గని, ఎంపీవో భవాని, ఎంఈఓ చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు రంగస్వామి, సురేందర్ రెడ్డి,సుధీర్ రెడ్డి, మండలంలోని వివిధ పాఠశాల క్రీడాకారులు,కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రావు పాల్గొన్నారు.

Next Story