- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజ అభ్యున్నతికి మహిళల పాత్ర కీలకం
సమాజ అభ్యున్నతికి మహిళల పాత్రే కీలకమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు.

దిశ,వనపర్తి: సమాజ అభ్యున్నతికి మహిళల పాత్రే కీలకమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖలలో నిబద్దతతో విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను,జ్ఞాపికాలను అందేశారు. ఈ సందర్భంగా లింగ వివక్ష లేకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వరకట్నం, బాల్యవివాహాలు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
మహిళలు తమ ఆరోగ్యంపై స్వయంగా జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ సూచించారు. జాగ్రత్తలు వహించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ అనే మహమ్మారిని దరిచేరనీయకుండా చేయవచ్చని తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్ పై జిల్లా కలెక్టర్,ఆయా శాఖల జిల్లా అధికారులు సంతకాలు చేశారు. అదేవిధంగా, గర్భిణీల లింగ నిర్ధారణ పరీక్షలకుకు వ్యతిరేకంగా ఆర్డీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ యాదయ్య,డిస్పి వెంకటేశ్వర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్, వివిధ శాఖలకు చెందిన మహిళ అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.






