- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2002, 2025 ఓటరు జాబితాలు సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
2002, 2025 ఓటరు జాబితాలు సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.

2002, 2025 ఓటరు జాబితాలు సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి,
అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
హాజరైన గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్
దిశ, గద్వాల కలెక్టరేట్ : 2002, 2025 ఓటరు జాబితాలు సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ... 2002, 2025 ఓటరు జాబితాల సరిపోల్చే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితాల మధ్య విశ్లేషణ, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలనను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు 4 కేటగిరీలుగా విభజించి తదనగుణంగా నిర్దేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ నెల 24వ తేదీగా నివేదికలు సమర్పించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా నివేదికలు రూపొందించాలని తెలిపారు. నిర్దేశిత గడుపులోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను ఎన్నికల విభాగం అధికారుల సమన్వయంతో వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డిఓ అలివేలు, తహశీల్దార్ మల్లికార్జున్, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






