కారు పై లారీ బోల్తా.. వ్య‌క్తి మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-07 15:26:17  IST  )

దిశ‌, కొత్త‌కోట : వనపర్తి జిల్లా కొత్తకోట మండల శివారు లో జాతీయ రహదారి 44 పై కారు ప్రమాదం చోటు చేసుకుంది. . పోలీసులు తెలిపిన

కారు పై లారీ బోల్తా..  వ్య‌క్తి మృతి
X

దిశ‌, కొత్త‌కోట : వనపర్తి జిల్లా కొత్తకోట మండల శివారు లో జాతీయ రహదారి 44 పై కారు ప్రమాదం చోటు చేసుకుంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నలుగురు పంచాయతీ సెక్రటరీలు కలసి గద్వాల్ లోని పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి అడ్డాకుల గ్రామానికి కారులో ప్రయాణిస్తున్న ఉండగా. కొత్తకోట గ్రామ శివారులో గల హైవేపై ఆగి వున్న కారును కర్నూల్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు కారు ఢీకొని కారుపై బోల్తాపడగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారని, వీరిలో సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా, మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరించి చికిత్స అందిస్తుండగా మరణించాడని సతీష్ రెడ్డి వేముల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Next Story