పేద‌వాడికి ప్ర‌భుత్వం వెన్నుద‌న్నుగా నిలుస్తోంది

by Ratna Kumari |

ప్రతి పేదవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంద‌ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.

పేద‌వాడికి ప్ర‌భుత్వం వెన్నుద‌న్నుగా నిలుస్తోంది
X

దిశ, వనపర్తి : ప్రతి పేదవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంద‌ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మున్సిప‌ల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే మేఘా మేఘా రెడ్డి వనపర్తి పట్టణంలోని 6,22, వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 6,22 వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ కౌన్సిల్ హక్కులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి వార్డు అభివృద్ధి చెందేందుకు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి గల్లీలో సిసి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టామన్నారు. వార్డులో కమ్యూనిటీ హాల్స్ ప్రత్యేక వీధి దీపాలు ఏర్పాటు చేపట్టినట్లు, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు, సన్న బియ్యం,ఉచిత విద్యుత్, మహిళ లకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సమైక్య భవనాల నిర్మాణం, మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం క్యాంటీన్ లను ఏర్పాటు, కుట్టు మిషన్ల పంపిణీ, మహిళను గౌరవిస్తూ ఇందిరమ్మ చీరల పంపిణీ లాంటి అనేక సంక్షేమ పథకాలను చేపట్టి నిరుపేదలకు ఇందిరమ్మ రాజ్యం వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. ఈ

Next Story