ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

by Ratna Kumari |

దిశ‌, మ‌ద్దూరు : ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ వృత్తిదారుల యూనియ‌న్

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి
X

దిశ‌, మ‌ద్దూరు : ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ వృత్తిదారుల యూనియ‌న్ జిల్లా కో ఆర్డినేట‌ర్ రాములు, మండ‌ల కో ఆర్డినేట‌ర్ మాన‌స‌, యూత్ కో ఆర్డినేట‌ర్ క‌విత డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం మ‌ద్దూర్ అంబేద్క‌ర్ చౌరస్తా నుంచి త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం ఎమ్మార్వోకి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి చట్టం రద్దు చేసి 2005 నుంచి అమల్లో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేలా చేయాలని కోరారు. మ‌హాత్మ‌గాంధీ ఉపాధి హామీ చ‌ట్టానికి బ‌దులుగా విక‌సిద్బార‌త్ గ్యారెంటీ ఫ‌ర్ రోజు గా అండ్ అద్విక మిష‌న్ గా పేరు పెట్టి పార్ల‌మెంట లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టడం జ‌రిగింది.

పార్ల‌మెంట్ లో బిల్లు అమ‌లులోకి వ‌స్తే.. వ్యవసాయ పనుల సీజన్లో 60 రోజుల పాటు ఉపాధి చట్టం అమలు ఉండదు. పని కావాలని డిమాండ్ చేసే హక్కు ఉండదు. ప్రభుత్వం కల్పించినప్పుడు మాత్రమే ఉంటుంది. స్త్రీ, పురుషులకు కనీస సమాన వేతనాలు ఉండవు. చేసిన పనికి వేతనాలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. బడ్జెట్ ఉంటేనే కూలీలకు పని కల్పిస్తారు. నిధులు లేకుంటే పని కల్పించారు. రాను రాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసే దిశలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మేము గల్లి నుండి ఢిల్లీ వరకు కొట్లాడి తెచ్చుకున్న 2005 చట్టం మాకు అమలు చేయాలని కోరుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు.

Next Story