ఉపాధి హామీ చ‌ట్టాన్ని కొన‌సాగించాలి

by Ratna Kumari |

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి, కూలీలకు 200 రోజులు పని కల్పించాలని కేంద్ర బీజేపీ విధానాలపై స్థానిక త‌హ‌శీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వ‌హించారు.

ఉపాధి హామీ చ‌ట్టాన్ని కొన‌సాగించాలి
X

దిశ‌, వీప‌న‌గండ్ల : గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి, కూలీలకు 200 రోజులు పని కల్పించాలని కేంద్ర బీజేపీ విధానాలపై స్థానిక త‌హ‌శీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్యోజన, విద్యుత్తు చట్టం, వి బి జి రామ్ జి అనే బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో మంద బలంతో, అఖిలపక్ష రాజకీయ పార్టీలతో ఏమాత్రం చర్చలు, సంప్రదింపులు లేకుండా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ప్రజాస్వామిక విధానాలకు పాల్పడిందని విమర్శించారు. ఉపాధి హామీ ఇకపై చట్టంగా ఉండబోదని,అది కేవలం ఒక పథకంగా మాత్రమే ఉంటుందని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో యంత్రాలను ఉపయోగించేవారు కాదని కేవలం మానవ శ్రమ మాత్రమే ఉండేదని, కానీ వీబిజిరాంజీ బిల్లులో ఉపాధిలో యంత్రాలు,యంత్ర పరికరాలను వినియోగించుకోవచ్చు అని చట్టం చేశారని తెలిపారు.

ఈ చ‌ట్టం వ‌ల్ల కూలీలకు పని దినాలలో కోతలు పెరుగుతాయని, ధనవంతులకు లాభాలు పెరుగుతాయని తెలిపారు.దేశంలో గ్రామీణ కూలీల ఉపాధిని దెబ్బతీయడానికి,సంక్షేమం నుండి తన బాధ్యతను తప్పించుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా చేసిందన్నారు.ఉపాధి హామీ పథకాన్ని చట్ట రూపంలో కాకుండా సంక్షేమ పథక రూపంలో అమలు చేయడం వల్ల ప్రజల ఉపాధికి హామీ ఉండబోదని, నిధుల సంఖ్యను సైతం తగ్గించారని తెలిపారు. అర్హులైన వారందరికీ పింఛన్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణయ్య, మండల నాయకులు గోపాల్ దిన్నె గ్రామ ఉప సర్పంచ్ వెంకటస్వామి, సీపీఎం మండల నాయకులు ఆశన్న, నక్క ఈశ్వర్, వి కృష్ణయ్య, బాల గౌడ్, వెంకటయ్య, మంజుల, నిరంజన్, తిరుపతయ్య, రంగస్వామి పాల్గొన్నారు.

Next Story