సర్వీస్ లోని ఉపాధ్యాయులకు 'టెట్' ను మినహాయించాలి

by Ratna Kumari |

రాష్ట్రంలో సర్వీస్ లో ఉన్న దాదాపు 50 వేలకు పైగా ఉన్న ఉపాధ్యాయులందరికీ 'టెట్' నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎంఎన్. విజయ్ కుమార్, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మురళీకృష్ణ లు విజ్ఞప్తి చేశారు.

సర్వీస్ లోని ఉపాధ్యాయులకు టెట్ ను మినహాయించాలి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాష్ట్రంలో సర్వీస్ లో ఉన్న దాదాపు 50 వేలకు పైగా ఉన్న ఉపాధ్యాయులందరికీ 'టెట్' నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎంఎన్. విజయ్ కుమార్, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మురళీకృష్ణ లు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ లో డీ.కే. అరుణ ను ఆమె క్యాంపు కార్యాలయంలో మరోసారి కలిసి విన్నతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. రాష్ట్రంలో 2010 కన్న ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు కోసం పార్లమెంటులో చట్ట సవరణ చేస్తూ అమెండ్మెంట్ చేయించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల అభద్రతాభావాన్ని తొలగించాల్సిదిగా ఆయన కోరారు. ఇందుకు ఎంపీ డీ.కే. అరుణ సానుకూలంగా స్పందించి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ సమస్యకు స్వస్తి పలుకుతామని ఆమె హామీ ఇచ్చినట్లు విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story