'షీ' కి చెప్పండి – సేఫ్‌గా ఉండండి : ఎస్పీ టి. శ్రీనివాసరావు

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల క్రైం : జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం గద్వాల పోలీస్ షీ టీమ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. “షీకి చెప్పండి – సేఫ్‌గా ఉండండి” అనే నినాదంతో షీ టీమ్ పాఠశాలలు, కళాశాలలు,

షీ కి చెప్పండి – సేఫ్‌గా ఉండండి : ఎస్పీ టి. శ్రీనివాసరావు
X

దిశ, గద్వాల క్రైం : జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం గద్వాల పోలీస్ షీ టీమ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. “షీకి చెప్పండి – సేఫ్‌గా ఉండండి” అనే నినాదంతో షీ టీమ్ పాఠశాలలు, కళాశాలలు, ప్రజా ప్రదేశాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312 కు కాల్ చేయాలని ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. కాల్ చేసిన వెంటనే స్పందించి భరోసా, రక్షణ అందించడం షీ టీమ్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్టోబర్ నెలలో షీ టీమ్ మొత్తం 16 అవగాహన కార్యక్రమాలు, 103 హాట్‌స్పాట్ తనిఖీలు, 2 పిటిషన్లు స్వీకరణ, 2 ఈ-పట్టి కేసులు నమోదు చేసింది. అలాగే 13 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించింది. షీ టీమ్ అవగాహన కార్యక్రమాల్లో చైల్డ్ మ్యారేజ్, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, సెల్ఫ్ డిఫెన్స్, టీ-సేఫ్, డయల్ 100 వినియోగం, సోషల్ మీడియా నేరాలపై అవగాహన అంశాలపై విద్యార్థులు, మహిళలకు చైతన్యం కల్పిస్తోంది. జిల్లా పోలీస్ శాఖ మహిళల భద్రత పట్ల కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.

Next Story