- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
14 ఏళ్లుగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో తహశీల్దార్ ఆఫీస్
మండల కేంద్రంలో ప్రతి కార్యాలయానికి సొంత భవనం ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండల తహశీల్దార్ కార్యాలయం దాదాపు 14 సంవత్సరాలుగా సొంత భవనం లేక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో కొనసాగుతోంది.

దిశ, మక్తల్ : మండల కేంద్రంలో ప్రతి కార్యాలయానికి సొంత భవనం ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండల తహశీల్దార్ కార్యాలయం దాదాపు 14 సంవత్సరాలుగా సొంత భవనం లేక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో కొనసాగుతోంది. తహశీల్దార్ భవన నిర్మాణం కోసం గ్రామస్తులు ఉచితంగా 20 గుంటల భూమిని ఇచ్చారు. భవన నిర్మాణం కోసం ప్రపోజల్ పంపినా నేటికి కార్యరూపం దాల్చక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. రాష్ట్రంలో కరువు వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా పాలకుల అధికారుల నిర్లక్ష్యానికి గురై మక్తల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదనడానికి నిదర్శనం. నాటి నిజాం నవాబ్ హైదరాబాద్ నుంచి తన పాలనలో ఉన్న కర్ణాటకకు వెళ్లేదారిలో కృష్ణా నది ఒడ్డున ఆహ్లదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు గ్రామ సరిహద్దులో విశ్రాంతి భవనాన్ని నిర్మించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అధికారులు దానిని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ గా మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గెస్ట్ హౌస్ ని తహశీల్దార్ కార్యాలయంగా మార్చేసింది.
తెలంగాణ ప్రభుత్వం మండలంలో కీలకమైన ఆదేశాలు జారీ చేసే తహశీల్దార్ కార్యాలయం దాదాపు 14 సంవత్సరాలుగా గెస్ట్ హౌస్ లోనే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించుకుంటున్న కీలక భూమిక పోషించే తహశీల్దార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో అధికారులకు పాలక ప్రభుత్వానికి సొంత భవనం ఉండాలనే ద్యాస లేకపోవడం విచిత్రం అనే చెప్పాలి. దాదాపు తహశీల్దార్ కార్యాలయం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన పరంగా ప్రజలకు మరింత చేరువ కావాలని రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తీర్ణంలో విశాలంగా ఉన్న మాగనూరు మండలాన్ని విభజించి కృష్ణ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రజలు మండలం అయిందని ఎంతో సంతోషపడ్డారు. ఒక సంస్థకు చెందిన ఎకరా స్థలంలో మండల ఎంపీపీ, తహశీల్దార్ కార్యాలయాల నిర్మాణాల కోసం అర ఎకరం కేటాయించారు.
బీఆర్ఎస్ ఎంపీపీ మండల కార్యాలయాన్ని నిర్మించగా.. తహశీల్దార్ కార్యాలయం గురించి పట్టించుకునే నాధుడు లేకపోవడంతో నేటికి తహశీల్దార్ కార్యాలయం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కొనసాగుతోంది. నియోజవకర్గంలో కొత్తగా ఏర్పడిన కృష్ణ తహశీల్దార్ కార్యాలయం భవనం లేకుండా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కొనసాగుతోంది. 2014లో కృష్ణ మండలం ఏర్పడగా.. ప్రభుత్వ కార్యాలయం కోసం సర్వే నెంబర్ 323లో ఎకరం భూమిలో 20 గుంటల భూమిని మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించగా.. పరిషత్ కార్యాలయం నిర్మాణం కోసం ప్రబోజల్ పంపించారు. నాటి పాలకులు అధికారుల చొరువ లేకపోవడంతో ప్రపోజల్ కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సొంత బిల్డింగ్ లు ఉండాలని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి చొరువ చూపి కృష్ణా తహశీల్దార్ కార్యాలయానికి సొంత భవనం ఉండేలా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.






